దేవుడు చెబతున్నాడు, “ఆ దుర్మార్గులకు సత్యం బాగా తెలుసు. కాని వారు నన్ను ప్రార్థించరు. ఆ దుర్మార్గులు వారి భోజనం తినటానికి ఎంత సిద్ధంగా ఉంటారో నా ప్రజలను నాశనం చేయటానికి కూడ అంత సిద్ధంగా ఉంటారు.”
కాని ఆ దుర్మార్గులు ఇంతకు ముందెన్నడూ భయ పడనంతగా భయపడిపోతారు. ఆ దుర్మార్గులు ఇశ్రాయేలీయులకు శత్రువులు. దేవుడు ఆ దుర్మార్గులను నిరాకరించాడు. కనుక మీరు వారిని ఓడిస్తారు. దేవుడు మీ శత్రువుల ఎముకలను చెదరగొట్టేస్తాడు.